రతిక నా కొడుకుని వాడుకుంది.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్

రతిక నా కొడుకుని వాడుకుంది.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7)లో పల్లవి ప్రశాంత్(Pallavi prashanth) స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయాడు. ఒక సాధారణ రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవల్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. వీక్లీ వీక్లీ జరిగే ఓటింగ్ లో కూడా మనోడు టాప్ లో ఉంటున్నాడు. ఇటీవల హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడం కూడా ప్రశాంత్ కు పాజిటీవ్ గా మారింది. దీంతో ఆడియన్స్ ప్రశాంత్ పై సింపతి చూపిస్తున్నారు.

ఇక తాజాగా పల్లవి ప్రశాంత్ కు వస్తున్న ఆదరణ చూసి తన తల్లి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల ఓకే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పల్లవి ప్రశాంత్ గురించి, బిగ్ బాస్ హౌస్ లో అతని ఆట గురించి, రతిక, ప్రశాంత్ లా రేలషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..  పల్లవి ప్రశాంత్ తల్లిగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. మాది చాలా పేద కుటుంబం.

Also Read :- అమ్ముమ్మ అయిన KGF 2 ప్రధానమంత్రి

తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రశాంత్ కు నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ పాట తీస్తే.. దాన్ని వేరే వాళ్లు అమ్ముకున్నారు. అప్పుడు నా కొడుకు చాలా బాధపడ్డాడు. ఆతరువాత అప్పు చేసి నా కొడుకుకి ఓ ఫోన్ కొన్నాను. ఆ ఫోన్లో తీసిన వీడియోలతోనే నా కొడుకుకి ఈరోజు బిగ్ బాస్ వరకు వెళ్ళాడు. ఆ ఫోన్ నా కొడుకు జీవితాన్ని మార్చేసింది. అని చెప్పుకొచ్చారు. 

 ఇక రతిక, పల్లవి ప్రశాంత్ ల గురించి అడగగా.. రతిక నా కొడుకుని వాడుకుంది. పల్లవి ప్రశాంత్‌తో మంచిగా ఉంటే..  అతనికి వచ్చే ఓట్లు నాకు కూడా వస్తాయని ప్లాన్ చేసింది. ప్రశాంత్ ఎవరినైనా అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడు. అంతే తప్ప అక్కడ ఏమిలేదు.. అని వివరించారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ తల్లి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.