
- జిల్లాలో ఏర్పాటు కానున్న పామాయిల్ ఫ్యాక్టరీ
- దావోస్‌లో యునీలివర్తో సర్కారు ఎంఓయూ
- ప్రస్తుతం జిల్లాలో 1,726 ఎకరాల్లో తోటలు
కామారెడ్డి , వెలుగు: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన యునీలివర్ సంస్థ కామారెడ్డి జిల్లాలో పామాయిల్ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో యునీలివర్కంపెనీతో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్‌బాబు ఒప్పందం చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతుల్లో హర్షంవ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఏర్పటయితే స్థానికులకు ఉపాధి దొరకడంతోపాటు ఆయిల్‌పామ్ సాగు మరింత పెరగనుంది.
సాగు టార్గెట్ సగమే
జిల్లాలో వరి, మక్క, చెరకు, సోయా, పత్తి ప్రధానంగా సాగు చేస్తారు. మూడేండ్ల నుంచి అయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రొత్సహిస్తుంది. సబ్సిడీలు ప్రకటించి.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. 2022–23లో జిల్లాలో అయిల్ పామ్ సాగు జరుగుతున్నా అనుకున్న టార్గెట్చేరుకోవడంలేదు. ఏటా 1,760 ఎకరాల్లో సాగు చేయాలని సర్కారు టార్గెట్పెట్టుకోగా సగం కూడా రీచ్ కావడంలేదు.
మూడేండ్లలో 5,280 ఎకరాల్లో సాగు చేయాలని భావించగా.. 1,726 ఎకరాలకే పరిమితమైంది. 2022– -23లో 800 ఎకరాలు, 2023–-24లో 610, 2024–-25లో 316 ఎకరాల్లో సాగు చేశారు. ఆయిల్పామ్తక్కువనీటితో సాగవుతుంది. పెద్దగా సాగునీటి వనరులు లేనందున వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంట వేయాలని అధికారులు చెప్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇస్తున్నారు.
స్థానికులకు ఉపాధి
రైతులు వరి పట్ల ఆసక్తితో ఇతర పంటల గురించి ఆలోచించడంలేదు. ప్రస్తుతం జిల్లాలో ప్రముఖ సంస్థ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకురావడంతో ఆయిల్‌పామ్ సాగు పట్ల రైతుల్లో సానుకూలత వస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయమే ప్రధానమైన కామారెడ్డి జిల్లాలో పెద్ద ఇండస్ట్రీస్లేవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉండడంతో ప్రభుత్వం సదాశివనగర్ మండలం లింగంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ALSO READ : అప్లికేషన్లు ఫుల్..ఎక్కువ రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకే
ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం 400 ఎకరాలను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఇక్కడ ఒక కంపెనీ యూనిట్ ఏర్పాటు పనులు ప్రారంభించింది. పామాయిల్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశిస్తున్నారు.