పొగాకు కంపెనీలకు ఊరట .. స్పెషల్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ను చేయడానికి మే 15 వరకు టైమ్‌‌‌‌

పొగాకు  కంపెనీలకు ఊరట .. స్పెషల్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ను చేయడానికి మే 15 వరకు  టైమ్‌‌‌‌

న్యూఢిల్లీ:  పొగాకు, గుట్కా, పాన్‌‌‌‌ మసాలా  తయారీ కంపెనీలకు ఊరట లభించింది. ఈ కంపెనీలు ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి  కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌‌‌‌ను అమలు చేయాల్సి ఉండగా, మే 15 వరకు ప్రభుత్వం టైమ్‌  ఇచ్చింది. అలానే మంత్లీ రిటర్న్స్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేయడం కూడా మే 15 తర్వాత నుంచి చేపట్టడానికి వీలు కలిపించింది. సెంట్రల్‌‌‌‌ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్‌‌‌‌, కస్టమ్స్ (సీబీఐసీ) ఈ ఏడాది జనవరిలో కొత్త రిజిస్ట్రేషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ను, మంత్లీ రిటర్న్‌‌‌‌ ఫైలింగ్‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. 

పాన్‌‌‌‌ మసాలా, పొగాకు ప్రొడక్ట్‌‌‌‌లను తయారు చేసే కంపెనీలు జీఎస్‌‌‌‌టీ రూల్స్‌‌‌‌ను సరిగ్గా ఫాలో అయ్యేలా చేయడానికి ఈ కొత్త విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. వీటి ప్రకారం,  ప్యాకేజింగ్ మెషినరీని జీఎస్‌‌‌‌టీ అధికారుల దగ్గర ఈ కంపెనీలు రిజిస్టర్ చేసుకోకపోతే రూ. లక్ష  వరకు ఫైన్  పడుతుంది. ఈ ప్రొవిజన్‌‌‌‌ను ఇంకా నోటిఫై  చేయలేదు. ఈ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ను పాన్‌‌‌‌ మసాలా,  హుక్కా లేదా గుడాకు, సిగరెట్లు, ఫిల్టర్ ఖైనీ, జర్దా, స్నప్‌‌‌‌ వంటివి తయారు చేసే కంపెనీలకు వర్తిస్తుంది.