మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కొందరు టాస్వరించి విజేతలుగా నిలిచి సంతోషంలో మునిగితేలుతున్నారు. షాద్నగర్నియోజకవర్గంలోని కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్లలో కాంగ్రెస్ పార్టీ మరాఠి రాజును బలపరిచింది. కాంగ్రెస్‌లోనే ఉన్న మరో అభ్యర్థి మరాఠి రాము కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇద్దరికీ 212 ఓట్లు వచ్చాయి. అధికారులు రికౌంటింగ్ చేయగా, మళ్లీ అవే ఓట్లు వచ్చాయి. దీంతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య టాస్ వేయగా మరాఠి రాజును విజయం వరించింది. ఇదే జిల్లా ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ లో మూడో వార్డులో ఇద్దరికీ ఓట్లు సమానం రాగా, అధికారులు టాస్ వేశారు. ఇందులో గంతల రాజు గెలుపొందాడు.
రెండు ఓట్లతో గెలుపు
కేశంపేట మండలం శేరిగూడలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి శారద రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన విజయమ్మ రికౌంటింగ్ కు పట్టుబట్టగా, అధికారులు ఒప్పుకోలేదని మాజీ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆందోళనలకు దిగారు.
ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ఓటమి
షాద్నగర్ఎమ్మెల్యే స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా సర్పంచ్‌గా గెలుపొందాడు.

