సమ్మె బాటలో ఈ పంచాయతీ ఆపరేటర్లు కలెక్టర్​కు నోటీసులు

సమ్మె బాటలో ఈ పంచాయతీ ఆపరేటర్లు కలెక్టర్​కు నోటీసులు
  • కలెక్టర్​కు​ సమ్మె నోటీసుల అందజేత

మంచిర్యాల​, వెలుగు : గ్రామపంచాయతీ పనులను పర్యవేక్షిస్తున్న ఈ ‌‌-పంచాయతీ ఆపరేటర్లు సమ్మె బాట పట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 28 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్​ బదావత్​ సంతోష్​, అడిషనల్​ కలెక్టర్​ రాహుల్​, డీపీఓ వెంకటేశ్వర్​రావులతో పాటు ఇతర అధికారులకు వినతిపత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్​ దాసరి నరేందర్​, ఈ -పంచాయతీ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్​ మాట్లాడుతూ..  రాష్ట్రంలో 1619 మంది ఈ -పంచాయతీ ఆపరేటర్లు 32 జిల్లాలో 13 సంవత్సరాలుగా పని చేస్తున్నారని.. అయినప్పటికీ ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రతి పని ఆన్​లైన్​లో చేస్తున్నా ప్రభుత్వం తమని  గుర్తించడం లేదన్నారు.

Also Read :- అదంతా అల్లు అర్జున్ పైన ఇష్టంతోనే.. జవాన్ దర్శకుడు అట్లీ

జిల్లా స్థాయిలో ప్రాజెక్టు మేనేజర్లకు పేస్కేల్​ అమలు చేసి జాబ్​ గ్యారెంటీ కల్పించాలని, ఆపరేటర్లకు జూనియర్​ అసిస్టెంట్​ పేస్కేల్​ కల్పించాలని, మహిళా ఆపరేటర్లకు ప్రసూతి సెలవులతో పాటు వేతనం అందించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించేఅన్ని వసతులను కల్పించాలని డిమాండ్​ చేశారు.  వినతిపత్రం ఇచ్చిన వారిలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్​ దాసరి నరేందర్​, ఈ -పంచాయతీ ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాకేష్​, ఉపాధ్యక్షుడు పవన్​, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కుమారస్వామి, ఈ -పంచాయతీ ఆపరేటర్లు ఉన్నారు.