పానీ పూరీ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో తెలుసా ?

పానీ పూరీ అమ్మకాలపై నిషేధం.. ఎందుకో తెలుసా ?

చిన్నా పెద్ద ఇష్టపడి తినే పానీ పూరీని బ్యాన్ చేశారు. పానీ పూరీ తయారు చేసేందుకు నీటిని ఉపయోగిస్తాంటారనే సంగతి తెలిసిందే. ఈ నీటిలో కలరాకు సంబంధించిన బ్యాక్టీరియాను కనుగొన్నారు. దీంతో పానీ పూరీ అమ్మకాలు చేపట్టవద్దని ఆరోగ్య, జనాభా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పానీ పూరీ ప్రేమికులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. నేపాల్ దేశంలో నిర్ణయం తీసుకున్నారు. లలిత్ పూర్ మెట్రోపాలిటిన్ సిటీలో (Lalitpur Metropolitan City)లో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం నేపాల్ లో కలరా బారిన పడిన వారి సంఖ్య 12కి చేరుకుంది. వ్యాప్తిని నియంత్రించే పనిలో పడ్డారు అధికారులు. లలిత్ పూర్, రద్దీ ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఖాట్మండులో ఏడుగురు వ్యక్తుల్లో కలరా పాజిటివ్ ఉందని ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏడింటిలో మెట్రోపాలిటిన్ లో ఐదు, చంద్రగిరి, బుధానీలకంఠ మున్సిపాల్టీలలో ఒక్కొక్కటి చొప్పున కేసులున్నట్లు నిర్ధారించడం జరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని director at Epidemiology and Disease డైరెక్టర్ Chumanlal Dash వెల్లడించారు. కలరా బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏడుగురిలో ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కలరా యొక్క లక్షణాలు కలిగిన వారు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. వర్షకాలంలో డయేరియా, కలరా వ్యాధులు కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.