ఆరు నెలలకు సరిపడా రేషన్‌తో నిరసనకు వచ్చిన రైతులు

ఆరు నెలలకు సరిపడా రేషన్‌తో నిరసనకు వచ్చిన రైతులు

అగ్రి బిల్లుకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఢిల్లీ-హర్యానా బోర్డర్‌లో ఆందోళన కొనసాగిస్తున్నారు. సింఘూ బోర్డర్ దగ్గర ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. దాంతో రైతులను అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం వేలాదిగా బలగాలను మోహరించింది. రైతులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు వారిపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. రైతులను ఫెన్సింగ్ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు నిరసనలలో పాల్గొంటుండటంతో సింఘు బోర్డర్‌ను ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా క్లోజ్ చేశారు. అంతేకాకుండా హర్యానా నుంచి వచ్చే వాహనాలను వెస్ట్రన్-ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ రహదారులపైకి మళ్లించారు.

మరోవైపు పానిపట్ హైవేపైనా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైతులు ఢిల్లీ వైపు వచ్చేందుకు ట్రాక్టర్లలో బయల్దేరారు. కొన్ని వందల కొద్ది ట్రాక్టర్లు పానిపట్ హైవేపై కనిపిస్తున్నాయి. రైతులు రోడ్డుపైనే వంట చేసుకుంటున్నారు. ఎవరు అడ్డుకున్నా తాము ఢిల్లీకి వెళ్లి తీరతామని రైతులంటున్నారు. రైతులు తమతో పాటు ఆరు నెలలకు సరిపడా రేషన్ సరుకులను కూడా ట్రాక్టర్లలో వేసుకుని వచ్చి నిరసనలలో పాల్గొనడం గమనార్హం.

For More News..

వీడియో: నా మీదే పోటీచేస్తావా.. డివిజన్‌లో నీకు జాగా లేకుండా చేస్తా..

బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఛత్రపతి.. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?