
పరకాల, వెలుగు: పరకాల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో లాయర్లకు బుధవారం అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్గెస్ట్ గా హాజరైన న్యాయమూర్తి సాయి శరత్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సులతో మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు.
ప్రముఖ గుండె వైద్య నిపుణుడు, మెడికవర్ డాక్టర్ షఫీ పాలగిరి లాయర్లకు గుండె జబ్బులు, వాటి నిర్ధారణపై వివరించగా ఆర్థోపెడిక్ నిపుణుడు డా.నవీన్ ఆర్థో సమస్యలు, నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం లాయర్లందరికీ 2డీ ఎకో, ఈసీజీ, షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు.