తెలుగులో యోగానంద క్రియా యోగ పాఠాలు

తెలుగులో యోగానంద క్రియా యోగ పాఠాలు

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాలు (వైఎస్ఎస్ క్రియా యోగ) తెలుగులో విడుదలయ్యాయి. ఈ తెలుగు అనువాదాలను యోగదా సత్సంగ సొసైటీ (వైఎస్ఎస్) ఉపాధ్యక్షులు స్వామి స్మరణానంద,  బ్రహ్మచారి కేదారానంద్ ఆదివారం హైదరాబాద్​ బేగంపేటలోని ధ్యాన కేంద్రంలో ఆవిష్కరించారు. 1946 డిసెంబరులో విడుదలైన ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా యోగానంద లక్షలాది మందికి యోగా, ధ్యానాన్ని పరిచయం చేశారని స్మరణానంద చెప్పారు.

‘‘వైఎస్ఎస్ పాఠాలు వ్యక్తి జీవితాన్ని అన్ని కోణాల్లో సమున్నతంగా మార్చే శక్తిని అందిస్తాయి. యోగా గురువులు మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్, యోగానంద అందించిన ధ్యాన పద్ధతులతోపాటు ప్రస్తుత ప్రపంచంలోని ఎడతెగని సవాళ్లను ఎదుర్కొని ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పుతాయి” అని తెలిపారు. మరింత సమాచారాన్ని yssi.org/Lessons లింక్​ ద్వారా లేదా 06516655555 నంబర్​కు ఫోన్​ చేసి తెలుసుకోవచ్చన్నారు.