
కార్టూమ్: సూడాన్‌లో పారా మిలటరీ బలగాలు మరోసారి నరమేధం సృష్టించాయి. శనివారం (అక్టోబర్ 11) డార్ఫర్ నగరాన్ని ముట్టడించిన సూడాన్ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్.. ఓ వలస శిబిరంపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కాల్పుల్లో కనీసం 60 మంది చనిపోయినట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర డార్ఫర్ ప్రావిన్స్ పరిపాలనా కేంద్రమైన ఎల్-ఫాషర్‌లో వలస కుటుంబాలకు నివాసంగా ఉన్న అల్-అర్కామ్ హోమ్‌ను రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సుడాన్ డాక్టర్స్ నెట్‌వర్క్ నివేదించింది. ఈ ఆశ్రయం ఓమ్‌దుర్మాన్ ఇస్లామిక్ యూనివర్శిటీ ప్రాంగంణలో ఉంది.
►ALSO READ | పోలీసు ట్రైనింగ్ సెంటర్‌పై బాంబ్ ఎటాక్: ఏడుగురు పోలీసులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతి
కాగా, ఎల్‌ఫాషర్ ప్రాంతం చాలా నెలలుగా సూడాన్ సైన్యం, పారామిలిటరీ గ్రూపుల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది. ఈ ప్రాంతంలో తరుచుగా ఇరువర్గాలు దాడులు చేసుకుంటాయి. తాజాగా పారామిలటరీ దాడిలో 60 మంది చనిపోయిన ఘటనపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.