మానసిక వైకల్యం ఉన్న పిల్ల‌ల‌కు పేరెంట్సే థెరపిస్టులు

మానసిక వైకల్యం ఉన్న పిల్ల‌ల‌కు పేరెంట్సే థెరపిస్టులు

క‌రోనా ఈ ప్రపంచాన్నే మార్చేసింది. కోవిడ్ భయం మన లైఫ్ స్టయిల్ ను మార్చేసింది. ఇంటికే పరిమితమై ఉండే ఈ కొత్త జీవితం కొంత ఒత్తిడిని, ఆందోళనను కలిగిస్తోంది. సాధారణ వ్యక్తులపైనే ఈ ప్రభావం ఇలా ఉంటే ఇక స్పెషల్ కిడ్స్ ఇంకా ఎక్కువగా ఉంటుందనేది వేరే చెప్పక్కర్లేదు. నేర్చుకునే వయసులో నేర్చుకోకపోతే వాళ్లు ఇంకెప్పటికీ నేర్చుకోలేరు కూడా. స్పెషల్ లెర్నింగ్ అవసరమైన పిల్ల కోసం ఇప్పుడు పేరెంట్సే థెరపిస్టులు. టెలీ రిహాబిలిటేషన్ సపోర్ట్ తో థెరపిస్ట్ సలహాలతో వినలేని, మాట్లాడలేని పిల్లకు ఇంట్లోనే విద్యాబుద్ధులు నేర్పకపోతే ఇంతకు ముందు నేర్చుకున్నది, చదివిందంతా పోతుంది.

చెవిటి, మూగ, మానసిక వైకల్యం ఉన్న పిల్లలు ప్రతి రోజూ అలవాటుగా చేసే పనులతో ఇబ్బంది పడరు. కానీ, ఎప్పుడైతే
దినచర్యలో మార్పు వస్తుందో, రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి బ్రేక్ అవుతుందో… అప్పుడు వాళ్ల‌లో ఆందోళన మొదలవుతుంది. అప్పటి నుంచి బిహేవియర్లో కూడా మార్పు వస్తుంది. అలాంటి పిల్లలు డిఫరెంట్ బిహేవియర్ తో ఉన్నారంటే, వాళ్లు ఆందోళనలో ఉన్నారని గుర్తించాలి. అప్పటి నుంచి వాళ్ల‌ను ఎక్కువగా కనిపెట్టుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో లోపాలు ఉన్న పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారు. స్పెషల్ కిడ్స్ కి దీర్ఘ‌కాలం పర్సనల్ టీచింగ్, హియరింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ స్పీచ్‌ థెరపీ ఆగిపోతే వాళ్ల‌ మానసిక ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఫ్యూచర్ కి మంచిది కాదు.

ఫ్యూచర్లో కష్టమే..

కరోనా భయం ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండటం వల్ల ఇంతకాలం వాళ్లు కష్టపడి నేర్చుకున్న స్కిల్స్ అన్నీ
మర్చిపోతుంటారు. వాళ్ల‌కు కావాల్సిన రెగ్యులర్ థెరపీ ఆగిపోతే చదువు, సోషల్ లైఫ్లో పూర్తిగా వెనుకబడే ప్రమాదం ఉంది. స్పెషల్ కిడ్స్ కోసం ఇప్పుడు శ్రద్ధ తీసుకోకపోతే ఫ్యూచర్లో నేర్చుకోవడంలో వెనుకబడిపోతారు. ఆ తర్వాత జీవిత కాలం తల్లిదండ్రులపైనే ఆధారపడి బతకాల్సి వస్తుంది. పేద, మధ్య తరగతి వారికి ఆర్ధికంగా మోయలేని భారం కూడా. అందుకే ప్రత్యేక అవసరాలున్న పిల్లల మీద పర్సనల్ కేర్, టీచింగ్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.

ఆన్ లైన్ లో రిహాబిలిటేషన్

ఈ పరిస్థితుల వల్ల విదేశాల్లో ఎక్కువగా ప్రాక్టీస్ లో ఉన్న టెలీ రిహాబిలిటేషన్ ఇప్పుడు మన దగ్గర కూడా తప్పనిసరి. పల్లెటూళ్ల‌లో ఉంటూ, పట్టణాలకు రాలేనివారికి, పట్టణాల్లో ఉన్నా రిహాబిలిటేషన్ సెంటర్ కు పోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్లు కన్సల్టెన్సీ ని, థెరపీని వాయిదా వేయకుండా టెలీ రిహాబిలిటేషన్ ద్వారా కంటిన్యూ చేస్తేనే వాళ్లు నేర్చుకున్న విషయాలను మర్చిపోకుండా ఉంటారు. స్కూల్స్ మళ్లీ ఓపెన్ చేసిన తర్వాత చదువులో వెనుకబడరు.

పేరెంట్స్ డౌట్స్

‘టెలీ రిహాబిలిటేషన్ పని చేస్తుందా? రిజల్ట్ ఉంటుందా?’ అని పేరెంట్స్ కి డౌట్ ఉంటుంది. విదేశాల్లో ఇది బాగానే ప్రాక్టీస్ లో ఉంది. మన దేశంలో ఈ పద్ధతిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం టెలీ కనెక్టివిటీ సరిగా లేకపోవడమే. అంతేకానీ, పని చేయదని కాదు. కోవిడ్ 19 వల్ల ఆన్లైన్లో టెలీ రిహాబిలిటేషన్ అవసరం ఎంతైనా ఉంది. పర్సనల్ హియరింగ్‌‌‌‌ అండ్‌‌‌‌ స్పీచ్‌ థెరపీతో ఎలాంటి రిజల్ట్ ఉంటుందో, టెలీ రిహాబిలిటేషన్ వల్ల కూడా అదే రిజల్ట్ ఉంటుంది. టెలీ రిహాబిలిటేషన్ థెరపీ ప్రభావం పై 27 స్టడీస్ జరిగాయి. రెండింటి వల్ల ఒకే రిజల్ట్ ఉంటుందని వాటిల్లో నిరూపణ అయ్యింది. కాబట్టి పేరెంట్స్ డౌట్ పెట్టుకోకుండా, తప్పకుండా పిల్లలకు టెలీ రిహాబిలిటేషన్ ద్వారా హియరింగ్, స్పీచ్ థెరపీ చేయించాలి.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ స్పీచ్‌థెరపీలో..

హియరింగ్, స్పీచ్ టెలి-ప్రాక్టీస్‌‌‌‌లో వీడియో కాన్ఫరెన్స్, ఇంటరాక్టివ్‌ యాక్టివిటీస్‌‌‌, అసెస్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ప్రోగ్రెస్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ ఉంటాయి. ఇందులో ప్లాన్ ప్రకారం ముందు పేరెంట్స్ తో మాట్లాడి పిల్లల ఆసక్తిని తెలుసుకుంటారు. ఆ తర్వాతనే స్పెషల్ కిడ్స్ తో కాన్ఫరెన్స్, థెరపీ మొదలుపెడతారు. వర్చువల్ ‌‌‌‌క్లాస్ లో డ్రాయింగ్ వేయిస్తారు. ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగిస్తూ వాళ్ల‌ను చిన్న చిన్న పనుల్లో ఉంచేందుకు ట్రైనింగ్ ఇస్తారు. క్లినిక్ క్కు పోవడం ఆగిపోయినప్పటి నుంచి పిల్లలకు ఇవ్వాల్సిన థెరపీని ఈ విధానంలో కంటిన్యూ చేయొచ్చు. రెగ్యులర్ థెరపీ, ఆన్ లైన్ థెరపీలో కొద్దిపాటి మార్పులుంటాయి. అందుకని ఆన్లైన్ థెరపీ కోసం స్పెషల్ గా ట్రైన్ అయిన హియరింగ్, స్పీచ్ థెరపిస్ట్ నే ఎంచుకోవాలి. టెలీ రిహాబిలిటేషన్ థెరపీలో ఫ్యామిలీ మెంబర్స్ స్పెషల్ కిడ్ కి సాయమందిస్తారు. అందువల్ల రిజల్ట్ మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు లేకపోవడం, కొత్త పరిసరాల్లోకి పోయామన్న ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఇది కిడ్స్ కి అనుకూలంగా ఉంటుంది. మానసిక ఆందోళనతో, నిరాశలో ఉన్న స్పెషల్ కిడ్స్ ని ఈ విధంగా బయటపడేయొచ్చు.

కరోనా పిల్లల ఆనందాలకు బ్రేక్ వేసింది. ఈ మహమ్మారి వల్ల శారీరక వైకల్యం ఉన్న పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వినికిడి శక్తి లేని, మాటలు రాని పిల్లల బాధలైతే చెప్పలేనన్ని. రెగ్యులర్ గా బయటికిపోయినట్లు పోవడం లేదు. బడికి పోలేకపోతున్నారు. ఇంటిపట్టున ఇట్లనే ఎక్కువ రోజులు ఉంటే వాళ్లలో శారీరక ఎదుగుదలే కానీ మానసిక ఎదుగుదల ఉండదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వేరే దారి లేని ఈ పరిస్థితుల్లో స్పెషల్ కిడ్స్ కేర్ ఎలా ఉండాలి? వాళ్ల లెర్నింగ్ని ఎట్ల కంటిన్యూ చేయాలో చెబుతున్నారు స్పీచ్ ‌లాంగ్వేజ్‌ థెరపిస్ట్ డాక్టర్ గరిమ వేగివాడ.