చాలాకాలంగా మన తినే ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ మంచిది కాదని, గుండెపోటుకు కారణమవుతుందని చాల మంది అనుకుంటారు. అయితే సైన్స్ మారుతున్న కొద్దీ మనకు దానిపై ఉన్న అవగాహన కూడా మారుతోంది. అయితే చెడు కొలెస్ట్రాల్(cholesterol) హానికరం కాదు, అలాగని ప్రతి తక్కువ కొవ్వు(low-fat) ఆహారం కూడా గుండెకు మంచిది కాదు.
మన దేశంలో యువకులు కూడా గుండె జబ్బులతో బాధపడుతున్నారు, అందుకే కొలెస్ట్రాల్ గురించి సరిగ్గా తెలుసుకోవడం ముఖ్యం. డాక్టర్ రవి మాలిక్ కొలెస్ట్రాల్ గురించి దశాబ్దాలుగా ఉన్న కొన్ని అపోహలను తొలగిస్తు వివరించారు. కొలెస్ట్రాల్ మంచిది కాదు అనేది అపోహ. ఎందుకంటే మన శరీరానికి కొలెస్ట్రాల్ నిజంగా అవసరం. ఇది కణాలను తయారు చేయడానికి, హార్మోన్లు, విటమిన్ డి, కొవ్వును జీర్ణం చేసే పిత్త(Bile) ఆమ్లాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది.
మంచి కొలెస్ట్రాల్ (HDL) రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ను కాలేయానికి పంపి, శరీరం నుండి బయటకు పంపడానికి సహాయపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ (LDL) ధమనుల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది, గుండెపోటు ఇంకా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. డాక్టర్ మాలిక్ చెప్పినట్లు కొలెస్ట్రాల్ శత్రువు కాదు, సమానంగా లేకపోవడం సమస్య. ఎక్కువ LDL ఇంకా తక్కువ HDL కలిస్తేనే గుండెకు హాని.
గుడ్లు అనారోగ్యకరం, తినకూడదు అనే నమ్మకం చాలా పాతది, ఇది నిజం కాదు. మీరు ఆహారంలో తీసుకునే కొలెస్ట్రాల్ మీ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నేరుగా పెంచదు, మీ కాలేయం మీరు తినే దాని ఆధారంగా, కొలెస్ట్రాల్ ఉత్పత్తిని అడ్జస్ట్ చేస్తుంది అని డాక్టర్ మాలిక్ చెబుతున్నారు. చాలా మందికి, గుడ్లు లిమిట్ గా తినడం మంచిది. గుడ్డు కంటే, దానితో పాటు తీసుకునే వెన్న, చీజ్ లేదా నూనెలో వేయించినవి ఆరోగ్య సమస్యకు కారణమవుతాయి.
►ALSO READ | Phone Use : ఫోన్ వాడేటప్పుడు పాటించాల్సిన మర్యాదలు ఇవే..!
అధిక బరువు ఉన్నవారికి లేదా వృద్ధులకు మాత్రమే కొలెస్ట్రాల్ వస్తుంది అనేది కూడా పెద్ద అపోహ. నిజం ఏంటంటే అధిక కొలెస్ట్రాల్ ఒకరి వయస్సు, బరువు చూడదు. సన్నగా, ఆరోగ్యంగా కనిపించే వారికి కూడా జన్యువులు, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగవచ్చు. సిటీ నగరాల్లోని యువత కూడా అధిక LDL స్థాయిలతో బాధపడుతున్నారు. అందుకే మొదటి లక్షణం కనిపించే వరకు ఆగకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
దురదృష్టకమైన విషయం ఏంటంటే అధిక కొలస్ట్రాల్ ఉందొ లేదో అనేది ఈజీగా తెలుసుకోవడం సాధ్యం కాదు. అధిక కొలెస్ట్రాల్ సైలెంటుగా ఉంటుంది, పరిస్థితి ఆలస్యం అయ్యే కొద్దీ ఎలాంటి లక్షణాలు చూపదు. అధిక కొలస్ట్రాల్ నొప్పి లేదా అసౌకర్యాన్ని కలిగించదు. కానీ గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. అందుకే ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు లేదా గుండె జబ్బులు ఉన్నవారు లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకోవాలి.
అయితే కొలెస్ట్రాల్ తగ్గడానికి తక్కువ కొవ్వు ఉన్న ఆహారమే తినడం ఉత్తమం అనేది ఒక అపోహ. వాస్తవం ఏంటంటే అన్ని కొవ్వులు చెడ్డవి కావు. సరైనవి ఎంచుకోవడమే ముఖ్యం. ఆలివ్ ఆయిల్, నట్స్, సీడ్స్, కొవ్వు చేపల (ఫ్యాటీ ఫిష్) నుండి వచ్చే ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, మీ గుండెను కాపాడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువగా నెయ్యి వాడిన స్వీట్లు, డీప్-ఫ్రై చేసిన స్నాక్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, చిక్కటి కొవ్వులు నిజమైన శతువులు. మీ భోజనాన్ని బ్యాలెన్స్ గా చేసుకోండి. మీ శరీరం సరిగా పనిచేయడానికి మంచి కొవ్వులు అవసరం.
భారతీయ సాంప్రదాయ ఆహారాలు అన్నీ ఆరోగ్యకరమైనవే అనేది నిజం కాదు. భారతీయ వంటకాల్లో పప్పులు, ధాన్యాలు, మసాలాలు వంటి అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. కానీ వాటిని తయారుచేసే విధానం ఎక్కువగా వాటిని అనారోగ్యకరంగా మారుస్తుంది. చాలా సాంప్రదాయ వంటకాల్లో ఎక్కువ నూనె, నెయ్యి లేదా చక్కెర వాడతారు. ఇక్కడ వంటకాలు కాదు, తయారీ పద్ధతులే అసలు సమస్య.
తక్కువ నూనెతో వండటం, చిన్న భాగాలుగా తినడం, కొవ్వులను జాగ్రత్తగా సలెక్ట్ చేసుకోని తీసుకోవడం ద్వారా భారతీయ ఆహారాన్ని గుండెకు ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. మంచి, చెడు కొవ్వుల తేడా తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవడం, చురుకుగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ మాలిక్ చెప్పినట్లుగా కొలెస్ట్రాల్ చాలా అవసరం, కానీ జీవితంలో ప్రతిదానిలాగే బ్యాలెన్స్ ముఖ్యం. కాబట్టి భయం వద్దు, నియంత్రణే గుండె ఆరోగ్యానికి నిజమైన కీలకం అని గుర్తుంచుకోండి.
