 
                                    పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం శుక్ష పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ రోజుతో చాతుర్మాస వ్రతం ముగియడంతో వివాహాది, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ( 2025) ఉత్థాన ఏకాదశి నవంబర్ 1 న వచ్చింది. ఆరోజున ఆర్దిక సమస్యలతో బాధపడేవారు.. వివాహ నిశ్చయంలో ఆటంకాలు కలిగే వారు కొన్ని ప్రత్యేకమైన పూజలు పాటిస్తే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
కార్తీక శుక్ల పక్షం ఏకాదశి తిథిని ఉత్థాన ఏకాదశి తిథి ..ప్రబోధన ఏకాదశి అంటారు. ఈ  రోజున విష్ణుమూర్తి నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్చొంటారు. ఈ రోజున ( నవంబర్ 1)  విష్ణుమూర్తిని పూజించుకుని ఉపవాసం ఉంటే చాలా మంచిదని ఆర్థిక సమస్యలతో పాటు... వివాహ సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి స్నానపు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానమాచరించి పసుపు దుస్తులు ధరించాలి. అనంతరం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి.
- ఉత్థాన ఏకాదశి నాడు ( నవంబర్ 1) శ్రీ మహా విష్ణువుకు కుంకుమ పువ్వు పాలతో అభిషేకం నిర్వహించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
- వివాహానికి సంబంధించిన సమస్యలున్నవారు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి కుంకుమ, చందన తిలకం దిద్ది.. ఆపై పసుపు పుష్పాలతో పూజించుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
- ఉత్థాన ఏకాదశి రోజున రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంకాలం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే అప్పుల బాధలకు పరిష్కారం లభిస్తుంది.
- తులసి పూజ చాలా మంచిది. తులసి మొక్కకు చెరుకు రసాన్ని నేవైద్యంగా సమర్పించి ఆవునెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం తులశమ్మకు హారతి ఇస్తే ఆర్థిక కష్టాలన్నీ పోయి ఐశ్వర్యవంతులవుతారు.

 
         
                     
                     
                    