విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన లైబ్రేరియన్‌ని పేరెంట్స్ చితకబాదారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కేంద్రీయ విశ్వ విద్యాలయంలో లైబ్రేరియన్ గా పని చేస్తున్న భాను ప్రకాష్నాయక్లైబ్రరీ తరగతిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
పిల్లల లోదుస్తుల వివరాలు అడుగుతూ.. తన ప్రైవేటు పార్ట్స్‌ని వారితో మసాజ్ చేయించుకునే వాడు. దీంతో పిల్లలు స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడేవారు. పేరెంట్స్ గమనించి ఆగస్టు 14న స్కూలుకు వెళ్లి ప్రకాష్ ని నిలదీశారు.
పొంతనలేని సమాధానం ఇస్తుండటంతో కోపోద్రిక్తులైన పేరెంట్స్ అతడ్ని చితకబాదారు. ఈ క్రమంలో పోలీసులు కలగజేసుకుని సర్దిచెప్పారు. ప్రిన్సిపల్‌కి గతంలో ఇదే విషయంపై కంప్లెంట్ చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.
అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై ప్రకాష్‌ని వివరణ కోరగా.. గతంలో ఉన్న ప్రిన్సిపల్తనపై కక్షకట్టి పేరెంట్స్‌తో అబద్ధాలు ప్రచారం చేయిస్తూ.. దాడి చేయిస్తున్నారని ఆరోపించాడు.