కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో స్టూడెంట్లకు ఎందుకు ఎల్లిపాయకారంతో భోజనం పెడుతున్నారని శనివారం నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్‌లో తల్లిదండ్రులు ప్రశ్నించారు.
వివరాల్లోకి వెళ్తే.. కూరగాయల కాంట్రాక్టర్ గడువు ముగియడంతో కొత్తగా ఎవరూ ముందుకు రాకపోవడంతో నెలరోజులుగా కారంతో భోజనం పెడుతున్నారని, గుడ్డుతో పెట్టిన భోజనంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పేరెంట్స్ మీటింగ్‌లో ప్రిన్సిపల్, టీచర్స్‌తో వాగ్వాదానికి దిగారు.
అనంతరం ఆందోళన చేపట్టడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సమస్య వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామని ప్రిన్సిపల్ అజయ్ సింగ్ నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
