అమ్మానాన్నలే థెరపిస్ట్​లు

అమ్మానాన్నలే థెరపిస్ట్​లు

పిల్లలందరూ ఒక్కలా ఉండరు. కొందరు హుషారుగా ఉంటే.. కొందరు డల్​గా ఉంటారు. మరికొందరు ప్రతిదానికీ అలుగుతూ, కోప్పడుతూ.. ఏ విషయాన్నీ సీరియస్​గా తీసుకోరు. అలాంటప్పుడు అమ్మానాన్నలకు అనుమానాలు, సందేహాలు ఎన్నో వస్తాయి. తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందా లేదా? వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో? అని కంగారుపడతారు. అలాంటి పిల్లలకు కౌన్సెలింగ్​ లేదా థెరపీ అవసరం.

చైల్డ్​ థెరపీలో చాలారకాలు ఉంటాయి. అందులో అన్నీ అందరికీ సరిపోతాయని గ్యారెంటీ ఉండదు. ఒక్కోరకమైన పద్ధతి ఒక్కొక్కరికి సూట్​ అవుతుంది. ఈ కౌన్సెలింగ్​ లేదా థెరపీలో ఎన్నోరకాల ఆటలు ఉంటాయి. అయితే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు థెరపీ అవసరం పడుతుందో ముందు తెలుసుకోవాలి. ఆ థెరపీలు ఎన్నిరకాలు… అవి ఏ విధంగా పిల్లలపై ఉపయోగించాలి? అవెలా సమస్యను పరిష్కరిస్తాయో చూద్దాం.

పిల్లలకు థెరపీ ఎప్పుడు అవసరం?

అమ్మానాన్నలు పిల్లల్లో వచ్చే మార్పులు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుంటే… పిల్లలకు ఎప్పుడు థెరపీ అవసరమో తెలుస్తుంది. ఈ కింది లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా థెరపీ అవసరం ఉంటుంది.   అనవసరమైన కోపం ఆపుకోలేని తొందర  సమాజ పరిస్థితులకు అడ్జస్ట్​ కాలేకపోవడం  నిద్రపోకపోవడం, పీడకలలతో భయపడటం  ఎప్పుడూ ఆందోళనగా ఉండటం  సడెన్​గా మార్కులు తగ్గడం  ఉన్నట్టుండి బరువు పెరగడం లేదా తగ్గడం, ఆకలి లేకపోవడం  ఆత్మహత్య ఆలోచనలు రావడం  చిన్న విషయానికే ఏడవడం లేదా బాధపడటం  సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం  నలుగురిలో కలవకుండా ఒంటరిగా ఉండటం  తమకు తాము హాని చేసుకోవడం.. అంటే శరీరంపై గాయాలు చేసుకోవడం

చైల్డ్ థెరపీల్లో రకాలు..

అన్ని థెరపీలు అందరికీ పని చెయ్యవు. అందుకే థెరపిస్ట్​లు, కౌన్సెలర్లు వీటిలో ఏ పేషెంట్​కి ఏ రకమైన థెరపీ పని చేస్తుందో అంచనా వేసి ట్రీట్​మెంట్​ ఇస్తారు. వాటిని తెలుసుకుని అమ్మానాన్నలు ఇంట్లోనే చేయొచ్చు.

అప్లైడ్​ బిహేవియర్​ అనాలిసిస్​  బిహేవియర్​ థెరపీ  కాగ్నిటివ్​ బిహేవియరల్​ థెరపీ

కాగ్నిటివ్​ థెరపీ  ఫ్యామిలీ థెరపీ  ఇంటర్​పర్సనల్ సైకోథెరపీ   ఆర్గనైజేషన్​ ట్రైనింగ్​

పసిపిల్లలకు థెరపీలు

పెద్దపిల్లలకు ఇచ్చే ట్రీట్​మెంట్… చిన్న వయసు పిల్లలకు​ సెట్​ కాదు. అందుకే వీళ్ల కోసం స్పెషల్​గా కొన్నిరకాల థెరపీలు ఉంటాయి. ఇవి వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని చేయించే థెరపీలు.

ప్లే థెరపీ  డైలెక్టికల్​ బిహేవియర్​ థెరపీ  గ్రూప్​ థెరపీ లేదా సైకోడైనమిక్​ సైకోథెరపీ

ఇంట్లో సమస్యకు పరిష్కారం..

ముందు చెప్పిన థెరపీల్లో చాలావాటిని ఇంట్లోనే అమ్మానాన్నలు చేయొచ్చు. కొన్నింటిని మాత్రం కచ్చితంగా థెరపిస్ట్లే చేయగలరు. అలాగే ఇంట్లో అమ్మానాన్నలకు పిల్లలు సహకరించకపోయినా.. ఎలాంటి మార్పు రాకపోయినా నిపుణుల దగ్గరకు తీసుకెళ్లాలి.
పిల్లల్లో మార్పు కోసం.. వాళ్లపై త్వరగా ప్రభావం చూపే ప్లే థెరపీని ఉపయోగించాలి. అంటే వాళ్లకు నచ్చిన ఆటలు ఆడిస్తూ ఆలోచనలను మార్చాలి. అలాగే వాళ్లను ఎప్పుడూ ఆటల్లో, చిన్నచిన్న పనుల్లో ఎంగేజ్ చేయాలి. ఇందులో పిల్లలతో పదాల ఆట ఆడించొచ్చు. అంటే రకరకాల జంతువులు, పండ్లు, కూరగాయల పేర్లు, బొమ్మలు ఉన్న చిట్టీలు చూపించాలి. అలాగే పిల్లల వయసు, జ్ఞానాన్ని బట్టి ఎమోషన్స్ నిండిన కథలను చెప్పాలి. అందులో మంచి, చెడులను వాళ్లంతట వాళ్లే తెలుసుకునేలా చేయాలి.
కోపం ఎక్కువగా ఉండే పిల్లలపై ఇంకోరకమైన థెరపీ ఉపయోగించాలి. వాళ్లకు చిన్నచిన్న పనులు చెప్పాలి. అప్పుడు వాళ్లలో వచ్చే కోపాన్ని బయటికి రానిచ్చి, ‘అది అనవసరం కదా’ అని వాళ్లకే తెలిసేలా చేయాలి. అప్పడు వాళ్లంతట వాళ్లకే.. ‘అక్కరలేని చోట ఎందుకు కోపం తెచ్చుకోవాల’నే ఆలోచన వస్తుంది.

స్లో మోషన్ గేమ్ అనే టెక్నిక్ ద్వారా పిల్లల్లో ‘సెల్ఫ్ కంట్రోల్’ని పెంచొచ్చు. ఇది తొందరపాటు, కంగారులను తగ్గిస్తుంది. ఇలాంటి పిల్లలకు ఒక పనిని అప్పజెప్పి, దాన్ని వీలైనంత మెల్లిగా చేయమనాలి. ఉదాహరణకు లెటర్ రాయడం, రాసిన వాటిని చదివించడం, సాకర్లాంటి గేమ్స్ని ఆడించడం, గోడ ఎక్కించడం. ఈ సమయంలో స్టాప్ వాచ్ని ఉపయోగించి, ఆ టైమ్ని పూర్తిగా ఉపయోగించి పని చేయాలని చెప్పడం ద్వారా పిల్లలను కంట్రోల్ చేయొచ్చు. ఇలా థెరపీని ఆటల్లా చేయడం వల్ల పిల్లలకు సెల్ఫ్ కంట్రోలింగ్ అలవాటవుతుంది.

బబుల్ (బుడగ) బ్రీత్ టెక్నిక్లో… థెరపిస్ట్లు పిల్లల్లో ఆందోళన తగ్గించడానికి ఈ బబుల్ బ్రీత్ని ఉపయోగిస్తారు. బుడగ పెద్దగా రావాలంటే.. శ్వాసను అంత గట్టిగా లోపలికి తీసుకోవాలని చెప్పాలి. తర్వాత దాన్ని బయటికి మెల్లిగా వదలాలనే రూల్ పెట్టాలి. అలా తరచూ చేయడం వల్ల పిల్లల్లోని ఆందోళన, కలతలు ఒక్కొక్కటిగా చెదిరిపోతాయి.
ఈ టెక్నిక్తో కోపం కూడా తగ్గుతుందంటున్నారు థెరపిస్ట్లు. ఇలా
ఒక్కో సమస్యకు ఒక్కోరకమైన థెరపీతో పిల్లలను ఆరోగ్యంగా పెంచొచ్చు.