
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా(Parinithi Chopra) తన ఫ్యాన్స్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన ఫ్యాన్స్ అని చెప్పుకొని కొంతమంది ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫ్యాన్స్ పేజెస్ నుండి అభిమానుల నటీ, నటులను పొగడటం కోసం తప్పుగా వాడుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు ఈ భామ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదే విషయంపై ఇటీవల స్పందించారు పరిణీతి చోప్రా.. నా పేరును వాడుకొని కొన్ని ఫ్యాన్ పేజీలు, ఫ్యాన్ క్లబ్ లు వారి అభిమాన నటీ, నటులకు ఫేవర్ గా పోస్టులు వేస్తున్నారు. అలాంటి పోస్టులు నా దృష్టికి వచ్చాయి. నేను ఎవరికీ ఫేవర్ గా ఎలాంటి పోస్టులు వేయలేదు. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి పోస్ట్ లు మళ్ళీ రిపీట్ అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టులు పెట్టె ముందు నిజానిజాలు ఏంటీ అనేది తెలుసుకోండి.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు పరిణితి. ఇక పరిణితి చోప్రా విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు.