పార్లమెంట్ లో 22 ఏండ్ల కింద ఏం జరిగింది?

పార్లమెంట్ లో 22 ఏండ్ల కింద ఏం జరిగింది?

న్యూఢిల్లీ: పార్లమెంట్​పై టెర్రరిస్టులు దాడి చేసి బుధవారానికి 22 ఏండ్లు గడిచాయి. తాజాగా ఇద్దరు దుండుగులు పార్లమెంట్​లో చొరబడి అలజడి సృష్టించారు. విజిటర్ గ్యాలరీలో కూర్చున్న వీళ్లు.. స్మోక్​ క్యాన్​తో హల్​చల్ చేశారు. సరిగ్గా 22 ఏండ్ల కింద ఇదే రోజు 2001, డిసెంబర్ 13న టెర్రరిస్టులు పార్లమెంట్​పై దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది అమరులయ్యారు. బుధవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో అమరవీరులకు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్​పర్సన్ సోనియా గాంధీతో పాటు పలువురు నేతలు పాల్గొని మౌనం పాటించారు. సరిగ్గా 22 ఏండ్ల తర్వాత మళ్లీ అదే తేదీన పార్లమెంట్​లో కలకలం రేగింది.

దాడికి బాధ్యులు ఎవరు?

30 నిమిషాలు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. 8 మంది భద్రతా సిబ్బంది,  గార్డెన్​లో పనిచేసే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 15 మంది గాయపడ్డారు. అప్పుడు హోంమంత్రిగా ఎల్​కే అద్వానీ ఉన్నారు. పార్లమెంట్​పై దాడికి పాల్పడింది లష్కరే తాయిబా, జైషే మహ్మద్ టెర్రరిస్టులు అని ప్రకటించారు. వాళ్లంతా పాకిస్తాన్​కు చెందినవాళ్లు అని, వారితో సంబంధం ఉన్న ఇండియన్లను కూడా అరెస్ట్ చేశామని వెల్లడించారు.

టెర్రరిస్టులకు హెల్ప్ చేసింది ఎవరు?

దాడి ఘటనలో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ మాజీ మిలిటెంట్ మహ్మద్ అఫ్జల్ గురు, అతని దగ్గరి బంధువు షౌకత్ హుస్సేన్ గురు, షౌకత్ భార్య అఫ్సన్ గురు, ఢిల్లీ యూనివర్సిటీలో పని చేస్తున్న అరబిక్ లెక్చరర్ గిలానీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్జల్ గురు, గిలానీ, షౌకత్​కు ట్రయల్ కోర్టు ఉరి శిక్ష విధించింది. అఫ్సన్, గిలానీల​ను నిర్దోషులుగా విడుదల చేసింది. షౌకత్​కు మరణ శిక్షను పదేండ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. అఫ్జల్ గురును మాత్రం 2013 ఫిబ్రవరిలో
ఉరి తీసి తీహార్ జైల్లోనే బొంద పెట్టారు.

అప్పుడు లోపలికి ఎలా వెళ్లారు?

2001 డిసెంబర్ 13న ఉదయం 11:40 గంటలకు ఐదుగురు టెర్రరిస్టులు హోం మినిస్ట్రీ స్టిక్కర్​తో ఉన్న అంబాసిడార్ కారులో పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్​కు చేరుకున్నారు. గేటు నంబర్ 12 దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆపినా ఆగకుండా లోపలికి తీసుకెళ్లారు. కారు దిగి భద్రతా సిబ్బందిపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోగించడంతో గేట్లన్నీ క్లోజ్ అయ్యాయి. ఆ టైమ్​లో పార్లమెంట్ లోపల 100 మంది మంత్రులు/ఎంపీలు ఉన్నారు.