పార్లమెంట్ ఎస్టేట్‌లో పార్లమెంట్ భవనం, పార్లమెంట్ హౌస్ అనెక్స్, పార్లమెంట్ లైబ్రరీ భవనాలు ఉన్నాయి. 1927లో పార్లమెంట్ భవనం, 1975లో పార్లమెంట్ హౌస్ అనెక్స్, 2002లో పార్లమెంటరీ లైబ్రరీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనానికి సర్ ఎడ్విన్ ల్యుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్లు ఆర్కిటెక్టులుగా పనిచేశారు. ఈ భవన నిర్మాణ శైలిని ల్యుటియన్స్ వాస్తు శైలిగా పేర్కొంటారు. పార్లమెంట్ భవనానికి 1921లో అప్పటి వైస్రాయ్ ఛెమ్స్‌ఫర్డ్ శంకుస్థాపన చేయగా, 1927 జనవరి 18న వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు.
నూతన భవనం
త్రిభుజాకారంలోని పార్లమెంట్ భవనానికి 2020, డిసెంబర్ 10న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. దీనిని సెంట్రల్ విస్టా రీడెవలప్ మెంట్ ప్రణాళికలో భాగంగా నిర్మిస్తున్నారు. కొత్త భవనాన్ని ధోల్పూర్ మైన్స్‌లో లభిస్తున్న ఎర్ర ఇసుకరాయితో నిర్మిస్తున్నారు. దీన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది.
ప్రధాన భవనం: ఈ భవనం పైభాగంలో అశోకుని చక్రాని పోలిన 4 సింహాలు లాగే ఒక కాల చక్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాల చక్రం 24 గంటల సమయాన్ని, 365 రోజులను సూచిస్తుంది.
లోక్‌సభ భవనం: ఈ భవనం సీటింగ్ కెపాసిటీ 888. ఇందులో జాతీయ పక్షి నెమలిని థీమ్‌గా డిజైన్ చేస్తున్నారు.
రాజ్యసభ భవనం: ఈ భవనం సీటింగ్ కెపాసిటీ 384. ఇందులో జాతీయ పుష్పం తామర డిజైన్ చేస్తున్నారు.
సెంట్రల్ లాంజ్: ఇందులో జాతీయ వృక్షం మర్రిచెట్టును థీమ్‌గా డిజైన్ చేస్తున్నారు.
సెంట్రల్ కాన్స్టిట్యూషన్ హాల్: ఇది గత చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది.
