
పార్లమెంట్ లో స్మోక్ అటాక్ దేశం మొత్తాన్ని అప్రమత్తమయ్యేలా చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్.. నిందితులను పార్లమెంట్‌కు తీసుకువెళ్లి, కాంప్లెక్స్‌లోని కట్టుదిట్టమైన భద్రతన మధ్య నేరస్థులు ఎలా వెళ్లారో తెలుసుకోవడానికి సీన్ రీక్రియేట్ చేయనున్నట్టు స్పెషల్ సెల్ వర్గాలు తెలిపాయి. వారు రంగు డబ్బాలతో పార్లమెంటు భవనంలోకి ఎలా ప్రవేశించారు, వారు తమ ప్రణాళికను ఎలా అమలు చేసారో అర్థం చేసుకోవడానికి పోలీసులకు ఇది సహాయపడుతుందని వివరించాయి.
పోలీసుల చర్యలు
సీన్‌ని రీక్రియేట్ చేయడానికి స్పెషల్ సెల్ నిందితులను పార్లమెంట్ ప్రాంగణంలోని గేట్ నుండి భవనం లోపలికి తీసుకువెళుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వారం రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున, డిసెంబర్ 14న ప్రధాన సూత్రధారి అరెస్ట్ కావడంతో పోలీసులు అదే రోజున అరెస్ట్ చేసినప్పటి నుంచి సీన్‌ను మళ్లీ రూపొందించలేకపోయారు. వారాంతంలో పార్లమెంటు సమావేశాలు జరగనందున డిసెంబర్ 16 లేదా 17న సన్నివేశాన్ని పునఃసృష్టించేందుకు స్పెషల్ సెల్ బృందం ప్రణాళిక రచిస్తోంది.
పలు నివేదికల ప్రకారం, పోలీసు బృందం నిందితులను వారు కలిసిన గురుగ్రామ్ ఫ్లాట్‌కు కూడా తీసుకువెళ్లనుంది. ప్రత్యేక సెల్ బృందం గత 15 రోజుల్లో నిందితులు డయల్ చేసిన 50 మొబైల్ నంబర్ల జాబితాను కూడా సిద్ధం చేసిందని, వారి గురించి తెలుసుకోవడానికి పోలీసులు ఈ నంబర్‌లకు కాల్ చేస్తున్నారని సమాచారం. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేయగా.. ఇందులో ఆరుగురు అనుమానితులే కాకుండా మరికొంత మంది ప్రమేయం ఉన్నారా లేక నిందితులకు వేరే వ్యక్తుల నుంచి సహాయం అందుతుందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.