జూన్ 24 నుంచి పార్లమెంట్

జూన్ 24 నుంచి పార్లమెంట్
  •  24, 25వ తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం
  • 26న లోక్​సభ స్పీకర్ ఎన్నిక.. జులై 3 వరకు స్పెషల్ సెషన్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్లమెంట్ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ నెల 24 నుంచి జులై 3 వరకు ఎనిమిది రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. 

ఈ నెల 24, 25వ తేదీల్లో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం, 26న స్పీకర్ ఎన్నికకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ ఎంపీ కె.సురేశ్, బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రొటెం స్పీకరే లోక్​సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.