గాల్లో తేలినట్టుందే... చిలుక ఫన్నీ రైడ్

 గాల్లో తేలినట్టుందే... చిలుక ఫన్నీ రైడ్

పక్షులు, జంతువులతో కూడిన కొన్ని ఆసక్తికర, ఫన్నీ వీడియోస్ ఎన్నో చూసి ఉంటాం. అలాంటి వీడియోల్లో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక చిలుక, తెరిచి ఉన్న కారు కిటీకీ పై భాగాన నిలబడి ఉంది. ఆ చిలుక కారు ప్రయాణిస్తుండగా గాల్లో విహరిస్తూ... ఆ గాలికి మైమరచిపోయి ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కారు ప్రయాణం జరుగుతుంది అంటున్నారు.... మరి ఆ చిలుకకు ప్రమాదమేమైనా జరిగితే.. అని కంగారు పడకండి. అలాంటి పరిణామాలేమీ ఎదురుకాకుండా ఆ యజమాని.. ఓ అడుగు ముందేవేశాడు. దానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చిలుక కాలుకి ఓ దారాన్ని కట్టి, అది కింద పడకుండా జాగ్రత్త వహించాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకుండా, సూపర్ హీరో అని క్యాప్షన్ ను కూడా తగిలించారు అడ్మిన్.  ఈ వీడియోను  ఫిబ్రవరిలోనే షేర్ చేశారు. కానీ ఇప్పుడు  ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 1.8మిలియన్ల మంది వీక్షించారు. అంతే కాదు దీనికి1.7 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియోపై యూజర్స్ కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ... చిలుక చేసే ఫన్నీ రైడ్ ను ఆస్వాదిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Cutest.bird (@cutest.bird)