తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. రాబోయే రోజుల్లో 45 డిగ్రీల ఎండ

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. రాబోయే రోజుల్లో 45 డిగ్రీల ఎండ

భారత  వాతావరణ శాఖ (ఐఎండీ) తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల గరిష్ట ఉష్ణ్రోగ్రత 45 డిగ్రీల వరకు నమోదవుతాయని తెలిపింది. మార్చి 27 నుంచి  29 వరకు  ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు (మార్చి 27) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో  40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

ALSO READ | Health Tip : టీ, కాఫీ బాగా వేడిగా తాగకూడదా.. వేడి వేడిగా తాగితే క్యాన్సర్ వస్తుందా..!

మార్చి 28న వడగాలులు వీస్తాయని వాటి వల్ల తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వేడి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది. రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు వరకు పెరుగుతాయన్నారు. సోమవారం (మార్చి 25) రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండలోని తిమ్మాపూర్‌, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతనగర్‌లో 40.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో అత్యధికంగా 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.