శశికళను పార్టీలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయం

శశికళను పార్టీలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయం

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి.. విడుదల అయ్యాక ఇటీవల మొదటి సారిగా  తమిళనాడు మాజీ సీఎం  జయలిలత సమాధి  దగ్గర పెద్ద ఎత్తున సందడి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ  క్రమంలో  గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకే (AIADMK)లోకి శశికళ పునరాగమనంపై ప్రచారం ఊపందుకుంది.

దీనిపై పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్పందించారు. శశికళను పార్టీలోకి తీసుకోవడంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీల్లో ఎవరు ఎప్పుడైనా వస్తుంటారు, పోతుంటారు అని అన్నారు.  శశికళ భవితవ్యాన్ని AIADMK అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తే ఒకప్పుడు జయలలిత హయాంలో తెరవెనుక శక్తిలా అన్నాడీఎంకే రాజకీయాలను శాసించిన శశికళ.. పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.