ఒకే కుటుంబం పార్టీని తరాల పాటు నడిపిస్తే ఎలా?

ఒకే కుటుంబం పార్టీని తరాల పాటు నడిపిస్తే ఎలా?

న్యూఢిల్లీ: ఒకే కుటుంబం కొన్ని తరాలపాటు పార్టీలను పాలించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీని వల్ల పార్టీలోని అన్ని వ్యవస్థల్లోనూ ఆ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువవుతుందని.. ఇది డేంజర్ అన్నారు. పార్లమెంట్ లో నిర్వహించిన 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘రాజకీయ పార్టీని కేవలం ఒక కుటుంబం నడపడం సరికాదు. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు ఎన్నో పార్టీలను చూశాం. ఇది ప్రజాస్వామ్య భావనకు పూర్తి విరుద్ధం. రాజ్యాంగం మనకు చెప్పేదానికి ఇది వ్యతిరేకమైంది. కుటుంబ పార్టీల్లో ఒక వ్యక్తిని మించి మరెవరూ రాజకీయాల్లోకి రావొద్దు. యోగ్యతను బట్టి ప్రజాశీర్వాదం ఉంటే ఏ కుటుంబంలో నుంచైనా ఒకరి కంటే ఎక్కువ మంది రాజకీయాల్లోకి వెళ్లొచ్చు. దీని వల్ల పార్టీలు కుటుంబ పార్టీలుగా మారవు. ఒక పార్టీని కొన్ని తరాలుగా ఒకే కుటుంబీకులు పాలిస్తూ వస్తే ఎలా? పార్టీలోని అన్ని వ్యవస్థలు వాళ్ల చేతుల్లోనే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పులా మారుతుంది’ అని మోడీ చెప్పారు.  

మరిన్ని వార్తల కోసం:

తలలపై తుపాకులు పెట్టి పాలించలేరు

కేసీఆర్.. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా

అయ్యర్ అదుర్స్.. అరంగేట్రంలోనే సెంచరీ