అయ్యర్ అదుర్స్.. అరంగేట్రంలోనే సెంచరీ

అయ్యర్ అదుర్స్.. అరంగేట్రంలోనే సెంచరీ

కాన్పూర్: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు, రెండో రోజు టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. అరంగేట్ర మ్యాచులోనే సెంచరీ (105)తో సత్తా చాటాడు. తద్వారా భారత్ తరఫున టెస్టుల్లో మూడంకెల స్కోరు చేసిన 16వ బ్యాట్స్ మన్ గా నిలిచాడు. అయితే సెంచరీ తర్వాత మరో 5 రన్స్ చేసి టిమ్ సౌతీ బౌలింగ్ లో ఔట్ అయి వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్ లో అయ్యర్ 13 బౌండరీలు, 2 సిక్సులు బాదడం విశేషం. రవీంద్ర జడేజా (50) కూడా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. అర్ధ సెంచరీ బాది.. జట్టు స్కోరు 300 దాటడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (33), ఉమేశ్ యాదవ్ (3) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో సౌతీ 5 వికెట్లతో సత్తా చాటాడు. కైల్ జెమీసన్ మూడు వికెట్లు తీశాడు. 

మరిన్ని వార్తల కోసం:

ముంబై దాడులకు నేటితో 13 ఏళ్లు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

కరోనా కొత్త వేరియంట్.. మళ్లీ ఆంక్షలు విధిస్తున్న బ్రిటన్