
బంగారం అక్రమంగా రవాణా చేయడానికి పలువురు ఎంచుకుంటున్న దారులు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. విదేశాల నుంచి బంగారాన్ని హైదరాబాద్‌కి తరలిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జులై 27న గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ప్యాసింజర్లు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలేషియా నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ప్రయాణికులు జీన్స్, లోదుస్తుల్లో బంగారం పేస్ట్‌ని దాచి స్మగ్లింగ్చేయడానికి ప్రయత్నించారు.
ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.94 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో సిగరెట్లు..
ఇదే రోజు దుబాయి నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఎయిర్పోర్ట్అధికారులు 34 వేల 800 నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.