ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కద్దు.. అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి

ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కద్దు.. అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి

ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కద్దు.. ఈ విమానాలు బుక్ చేసుకోవద్దు.. ఎందుకంటే, మేము పడిన ఇబ్బందులు మీరు పడద్దంటున్నారు అయ్యప్ప భక్తులు. తాము వెళ్లల్సిన విమానం 5 గంటలు ఆలస్యం అయిందని.. ఎందుకు ఇలా అయిందని అధికారులకు అడిగినా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని.. అధికారులతో గొడవ పెట్టుకొని.. రచ్చ రచ్చ చేశారు. కనీసం తమకు మంచి నీరు కూడా ఇవ్వడం లేదని.. అధికారులపై తీవ్ర విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే.. 
  
శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చికి వెళ్లాల్సిన 30 మంది అయ్యప్ప భక్తులు నిన్న(జనవరి 17) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఐ ఎక్స్ 955 విమానం సాయంత్రం(జనవరి 17) 7.15 గంటలకు బయలుదేరాలి.. కానీ రాత్రి 11.30 నిమిషాలు అయినా బయలుదేరకపోవడం ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఫైట్ అనుకున్న సమయానికి బయలు దేరకపోగా.. ఐదు గంటలు ఆలస్యం కావడం ప్రయాణికులు విమాన అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకు ఇంత లేటని అడిగితే.. తమకు తెలియదన్నట్లు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అయ్యప్ప స్వాములు అధికారులతో గొడవకు దిగారు. 

తాము వెళ్లాల్సిన విమానం ఎప్పుడు వస్తుందో తెలియదనీ, కనీసం వేరొక విమానానైనా అధికారులు ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల కోసం కనీసం మంచినీరు వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనల వల్లే ఎయిర్ ఇండియా అంటే విరక్తి పుడుతుందని విమర్శలు చేశారు ప్రయాణికులు. ఎయిర్ ఇండియా విమాన అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.