ఆధార్​కు పాస్​పోర్ట్​ లాంటి వెరిఫికేషన్​

ఆధార్​కు పాస్​పోర్ట్​ లాంటి వెరిఫికేషన్​

న్యూఢిల్లీ :  కొత్తగా ఆధార్ కార్డ్ తీసుకునేవారిని పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వెరిఫికేషన్ మాదిరే ప్రభుత్వ అధికారులు ఇంటికొచ్చి చెకింగ్స్  చేయనున్నారు. ఈ రూల్‌‌‌‌ 18 ఏళ్లు దాటిన వారికి వర్తిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, ఆధార్ ఎన్‌‌‌‌రోల్‌‌‌‌మెంట్‌‌‌‌కు సంబంధించిన ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్‌‌‌‌ను  యూఐడీఏఐకి బదులుగా రాష్ట్ర  ప్రభుత్వం చూసుకుంటుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలనుకునే వారు తమ ఏరియా పరిధిలో కేటాయించిన సెంటర్లకు వెళ్లి ఆధార్ సర్వీస్‌‌‌‌లు పొందొచ్చు. 

ఈ సెంటర్లలో పోస్ట్ ఆఫీస్‌‌‌‌లు, యూఐడీఏఐ కేటాయించిన సెంటర్లు కూడా కలిసి ఉంటాయి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో  వెరిఫికేషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ను పూర్తి చేసే ముందు అన్ని ఆధార్ అప్లికేషన్లలోని డేటాను క్వాలిటీ చెకింగ్ చేస్తారు.  సబ్‌‌‌‌డివిజన్‌‌‌‌ మేజిస్ట్రేట్స్‌‌‌‌  ఈ వెరిఫికేషన్ ప్రాసెస్‌‌‌‌ను చూసుకుంటాయి. క్లియరెన్స్ వచ్చాక 180 రోజుల్లో ఆధార్‌‌‌‌‌‌‌‌ కార్డును ఇష్యూ చేస్తారు. 

తాజాగా యూఏడీఏఐ ఇష్యూ చేసిన ఆదేశాలు  ముఖ్యంగా 18 ఏళ్లు పైబడిన  ఇండివిడ్యువల్స్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేస్తున్నాయని యూఏడీఏఐ లక్నో రీజియన్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ప్రశాంత్‌‌‌‌ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఒక్కసారి ఆధార్ కార్డు ఇష్యూ అయితే ఆ తర్వాత  నుంచి ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే  రెగ్యులర్ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నారు.