ఇంగ్లండ్​కు కమిన్స్​ దెబ్బ .. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 237కు ఆలౌట్‌‌‌‌

ఇంగ్లండ్​కు కమిన్స్​ దెబ్బ ..  తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 237కు ఆలౌట్‌‌‌‌

లీడ్స్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌తో జరుగుతున్న యాషెస్‌‌‌‌ మూడో టెస్ట్‌‌‌‌లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. కెప్టెన్‌‌‌‌ కమ్‌‌‌‌ పేసర్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (6/91) దెబ్బకు.. 68/3 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 52.3 ఓవర్లలో 237 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ బెన్‌‌‌‌ స్టోక్స్‌‌‌‌ (80) పోరాడినా మిగతా వారి నుంచి సరైన సహకారం అందలేదు. కమిన్స్‌‌‌‌ ధాటికి ఇంగ్లీష్‌‌‌‌ బ్యాటర్లు పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు. జో రూట్‌‌‌‌ (19), జానీ బెయిర్‌‌‌‌స్టో (19) నిరాశపర్చడంతో ఇంగ్లండ్‌‌‌‌ 87 రన్స్‌‌‌‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

అయితే ఓ ఎండ్‌‌‌‌లో పాతుకుపోయిన స్టోక్స్‌‌‌‌ కీలక పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్స్‌‌‌‌తో ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో మొయిన్‌‌‌‌ అలీ (21)తో కలిసి ఆరో వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ జోడించాడు. క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌ (10), స్టువర్ట్‌‌‌‌ బ్రాడ్‌‌‌‌ (7) ఫెయిలైనా, మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ (24) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్‌‌‌‌ 2, మార్ష్‌‌‌‌, మర్ఫి చెరో వికెట్‌‌‌‌ పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 47 ఓవర్లలో 116/4 స్కోరు చేసింది. ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (18 బ్యాటింగ్‌‌‌‌), మార్ష్‌‌‌‌ (17 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ఖవాజ (43), లబుషేన్‌‌‌‌ (33) రాణించినా, వార్నర్‌‌‌‌ (1), స్మిత్‌‌‌‌ (2) విఫలమయ్యారు. ప్రస్తుతం కంగారూలు 142 రన్స్‌‌‌‌ లీడ్‌‌‌‌లో ఉన్నారు.