ఆస్ట్రేలియాకు షాక్.. నాలుగో టెస్టుకు కెప్టెన్ దూరం

ఆస్ట్రేలియాకు షాక్.. నాలుగో టెస్టుకు కెప్టెన్ దూరం

ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అహ్మదాబాద్ లో ఈనెల 9 నుంచి జరగనున్న భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ పూర్తిగా దూరమయ్యాడు. తల్లి రొమ్ము క్యాన్సర్ తో బాదపడుతున్న తన తల్లిని చూసేందుకు కమ్మిన్స్ రెండో టెస్టు ముగిసిన రోజే  సిడ్నీకి పయనమయ్యాడు. మూడో టెస్టుకు దూరంగా ఉన్న కమ్మిన్స్ ఆఖరి టెస్టు మ్యాచ్ కు వస్తారని బోర్డు అనుకుంది. కానీ, ఆరోగ్యం బాగా క్షీణించడంతో తనకు పాలియేటివ్ కేర్ ఇస్తున్నారు. దీంతో కమ్మిన్స్ నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనని ప్రకటించాడు. దీంతో చివరి టెస్టుకు స్టాండింగ్ కెప్టెన్ గా మళ్లి స్మిత్ నే నియమించనున్నారు.

కెప్టెన్ కమ్మిన్స్ గైర్హాజరుతో జట్టు పగ్గాలు చేపట్టిన స్మిత్ నాలుగో భారత్ ను చిత్తుగా ఓడించి ఆసీస్ కు రికార్డ్ విజయం అంధించాడు. మూడో టెస్టు గెలిచిన తర్వాత మాట్లాడిన స్మిత్ ఉపఖండం పిచ్ లపై కెప్టెన్సీ చేయడం తనకెంతో ఇష్టమని వెల్లడించాడు. స్మిత్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే చివరి టెస్టులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. ఇక భారత్ తో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికైన ఆసీస్ పేసర్ జే రిచర్డ్సన్ కూడా గాయం కారణంగా పూర్తి సిరీస్ కు  దూరమయ్యాడు.