బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్‌లో చేరిన పటాన్‍చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ కు షాక్ : కాంగ్రెస్‌లో చేరిన పటాన్‍చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కుండువాకప్పి గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. MLAతో పాటు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనికూమార్ ఆయన అనుచరులు, కార్పొరేటర్లు చేరారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దామోదరరాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి,నీలం మధు ఉన్నారు.

ALSO READ | బీఆర్ఎస్ పార్టీలో నాలుగురు ఎమ్మెల్యేలే మిగులుతారు : మంత్రి కోమటిరెడ్డి

ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. గూడెం మహిపాల్ రెడ్డి చేరికతో 10కి చేరింది. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సమావేశా నాటికి బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.