కలెక్టర్ దివ్య అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

 కలెక్టర్ దివ్య అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని చెప్పారు. ఇద్దరు మగవాళ్ళు తనను ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుని బట్టలు విప్పారని, ముందుగా వారు తనపై ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో అర్ధం కాలేదని తర్వాత అర్థమై అక్కడి నుంచి తాను పారిపోయానని అన్నారు.  వాళ్లు ఎవరో ఇప్పుడు గుర్తుకు రావడం లేదని, ఇలాంటి ఘటనల నుంచి తప్పించుకునే అదృష్టం పిల్లలందరికీ ఉండదని దివ్య అన్నారు. 

తన తల్లిదండ్రుల సహయంతో ఈ ఘటన నుంచి బయట పడినట్లుగా దివ్య వెల్లడించారు. అందుకే పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పుడే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని సూచించారు. చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన కల్పించేందుకు జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొ్న్నారు. కాగా దివ్య  అరువిక్కర మాజీ ఎమ్మెల్యే కెఎస్ శబరినాధన్‌ను వివాహం చేసుకుంది.