నిలోఫర్​కు వచ్చేదెట్లా.. పోయేదెట్లా?

నిలోఫర్​కు వచ్చేదెట్లా.. పోయేదెట్లా?

లక్డీకాపూల్​లోని నిలోఫర్ హాస్పిటల్ పరిసరాలు మళ్లీ ఇరుకుగా మారాయి. కనీసం అంబులెన్స్ లు వచ్చి, పోయే దారి కూడా ఉండడం లేదు. మెయిన్​గేట్, లేబర్ రూమ్ లకు వెళ్లేదారిలో తోపుడు బండ్లు, ఆటోలు, బైక్​లు అడ్డంగా నిలుపుతుండడంతో చాలా ఇబ్బందిగా ఉంటోందని పేషెంట్లు, వారి సహాయకులు, హాస్పిటల్​ స్టాఫ్​చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సమస్య తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. సిటీతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి డైలీ వందల మంది నిలోఫర్​కు వస్తుంటారు. ప్రస్తుతం సీజనల్​ వ్యాధులతో పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గతంలో అధికారులు తోపుడు బండ్లను తొలగించగా, స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిరువ్యాపారులు ధర్నా చేశారు. మూడు నెలల నుంచి పొద్దున్నే బండ్లు తెచ్చి పెడుతున్నారు.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- వెలుగు, హైదరాబాద్