ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు

ప్రభుత్వ ఆస్పత్రిలో డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కమలా నెహ్రు ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషంట్లు. డబ్బులు ఇస్తేనే ఆపరేషన్లు చేస్తున్నారని గర్భిణీలు చెప్తున్నారు. ఒక్కో సిజేరియన్ కు 5 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పేషంట్ల బంధువులు. డబ్బులు ఇవ్వకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లమంటున్నారని చెప్తున్నారు. 8 నెలల నుంచి హాస్పిటల్ డాక్టర్ డబ్బులు వసూలు చేస్తున్నా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు పేషంట్లు. హాస్పిటల్లో వైద్య సేవలపై కొద్ది రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. పేషంట్ల కంప్లైంట్లపై డాక్టర్లు, అధికారులను ప్రశ్నించారు. పేషంట్లను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐనా కూడా హాస్పిటల్ డాక్టర్లలో ఎలాంటి మార్పులేదంటున్నారు పేషంట్లు.