ఇలాంటోడికి.. అలాగే జరగాలి : భర్తపై దాడి చేసి అక్కడ పొడిచేసింది..

ఇలాంటోడికి.. అలాగే జరగాలి :  భర్తపై దాడి చేసి అక్కడ పొడిచేసింది..

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా సిటీలోని జరిగిన ఘటన సంచలనంగా మారింది. కొత్త పెళ్లయిన భార్యభర్తల మధ్య గొడవలో.. భార్య చేసిన పని.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సీఆర్పీఎఫ్ జవాన్ సూర్య భూషణ్ కుమార్– నేహకుమారి మధ్య కొన్నాళ్లుగా ప్రేమ నడుస్తుంది. రెండు కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించకపోవటంతో.. పెళ్లి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. సూర్యభూషణ్ కు మరో అమ్మాయితో పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న నేహాకుమారి.. సూర్యభూషణ్ పై ఒత్తిడి చేసి.. పాట్నా సిటీకి రప్పించింది. 

పెద్దలు వద్దన్నా.. వ్యతిరేకిస్తున్నా.. అన్నీ సర్దుకుంటాయి అనే ఉద్దేశంతో.. పోలీసుల సమక్షంలో పాట్నాలో పెళ్లి చేసుకున్నారు సూర్యభూషణ్ – నేహాకుమారి. ఇంట్లో విషయం తెలియటంతో భయపడి.. పాట్నాలోని ఓ హోటల్ లోనే ఉండిపోయారు కొత్త జంట. జూన్ 5వ తేదీన పెళ్లి జరగ్గా.. రెండు రోజులపాటు ఇద్దరి మధ్య కుటుంబ పెద్దలను ఒప్పించే విషయంపై చర్చలు జరిగాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. జూన్ 7వ తేదీ హోటల్  గదిలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  

తన ఇంట్లో మరో అమ్మాయితో పెళ్లి చేస్తామని చెబుతున్నారని.. ఈ పెళ్లి చెల్లదని వాదిస్తున్నారని.. మనం కొన్నాళ్లు వేర్వేరుగా ఉండాలంటూ సూర్యభూషణ్ చెప్పటంతో.. నేహాకుమారి ఆవేశం కట్టలు తెంచుకుంది. కొన్నేళ్లుగా ప్రేమ – పెళ్లి అంటూ తిరిగి.. పోలీసుల సమక్షంలో పెళ్లి చేసుకున్న తర్వాత.. మళ్లీ వేర్వేరుగా ఉండాలని కోరటం ఏంటని ప్రశ్నించింది. మీ ఇంటికే వస్తాను.. అక్కడే తేల్చుకుంటాను అని స్పష్టం చేయటంతో.. సూర్యభూషణ్ అందుకు అంగీకరించలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో.. హోటల్ గదిలో ఉన్న కత్తితో.. భర్త పై దాడి చేసి.. ప్రైవేట్ పార్ట్స్ పొడిచేసింది. 

ఊహించని పరిణామంలో షాక్ అయిన సూర్యభూషణ్.. గది నుంచి బయటకు పరుగులు తీశాడు. హోటల్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను పాట్నాలోని ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రేమ – పెళ్లి తర్వాత అతని మనసు మారిపోయిందని.. వాళ్ల ఇంట్లో వారి మాటలు విని నన్ను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడంటూ నేహాకుమారి ఆవేదన వ్యక్తం చేసింది. నా జీవితాన్ని నాశనం చేసి.. మరో అమ్మాయితో పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసి ఇలా చేసినట్లు చెబుతోంది.. 

ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా.. ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తర్వాత.. ఇంట్లో వాళ్లు వద్దన్నారని వదిలేయటానికి అది వస్తువు కాదు కదా.. అమ్మాయి కదా అంటున్నారు నెటిజన్లు.. ఇలాంటోడికి.. ఇలాగే జరగాలని.. అప్పుడే బుద్దొస్తుందంటూ కామెంట్స్ చేస్తూ.. ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు.