
జైనూర్, వెలుగు: పట్నాపూర్ పరమహంస సద్గురు పులాజీ బాబా జయంతిని పురస్కరించుకొని శుక్రవారం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బాబా సతీమణి ఇంగిలే దుర్పతబాయి ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఆవిష్కరించారు. భక్తుల కోసం జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు ఆర్టీసీ బస్ సర్వీస్ లను ప్రారంభించారు. అనంతరం ధ్యాన ధారణ గ్రంథ పూజతో వేడుకలు నిర్వహించారు.
శనివారం జయంతి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థాన్ అధ్యక్షుడు ఇంగ్లే కేశవరావు, గౌరవ అధ్యక్షుడు వమాన్ మాలి, సంఘం అధ్యక్షుడు శంకర్ భగవంత్ రావు, మాజీ సర్పంచ్ ఖండరే బాలాజీ, గ్రామ పెద్దలు రంగారావు, దాదారావు, గంగాధర్, కార్యదర్శి సుభాష్ డుక్రే తదితరులు పాల్గొన్నారు.