
జనసేనకు చెందిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసుకు వచ్చారు. త్వరలో పవన్ చేపట్టనున్న యాత్ర కోసం మరో 6 వాహనాలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో వాటిని రిజిస్ట్రేషన్ కోసం పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసుకు స్వయంగా వచ్చారు. డిజిటల్ సంతకం చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ రాకలో ఆర్టీఓ కార్యాలయంలో సందడి నెలకొంది.
ఎన్నికల ప్రచారం కోసం ఇటీవల తయారు చేయించిన 'వారాహి' వాహనం రిజిస్ట్రేషన్ గురువారం పూర్తైంది. పూర్తి చేసిన పవన్.. ఓ బెంజ్ కారుతో పాటు మరికొన్ని వాహనాలకు గురువారం రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 6 వాహనాలకు పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో ఒకటి బెంజ్, టయోటా వెల్‌ఫైర్, 2 స్కార్పియోలు, జీప్, ఒక గూడ్స్ వెహికల్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిపై సుమారు రూ.80 లక్షల లైఫ్ ట్యాక్సీ చెల్లించారు.