
రీసెంట్‌గా ‘హరిహర వీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్.. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ‘ఓజీ’ని కంప్లీట్ చేయగా, ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీపై ఫోకస్ పెట్టారు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది.
ఎమోషన్‌తో పాటు యాక్షన్‌తో కూడిన క్లైమాక్స్‌ను రూపొందించినట్టు మేకర్స్ తెలియజేశారు. నబకాంత మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పవర్‌ఫుల్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ సీక్వెన్స్ బాగా రావడానికి కృషి చేసిన ఫైట్ మాస్టర్స్ టీమ్‌ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా సెట్‌లో హరీష్ శంకర్‌తో కలిసి పవన్ దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.