Hari Hara Veera Mallu: ఘోరంగా పడిపోయిన.. హరిహర వీరమల్లు సెకండ్ డే కలెక్షన్స్.. జస్ట్ సింగిల్ డిజిట్ !

Hari Hara Veera Mallu: ఘోరంగా పడిపోయిన.. హరిహర వీరమల్లు సెకండ్ డే కలెక్షన్స్.. జస్ట్ సింగిల్ డిజిట్ !

పవన్ కల్యాణ్ అభిమానుల ఆశలను హరిహర వీరమల్లు సినిమా పూర్తిగా నీరుగార్చేసింది. ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్సే వచ్చినప్పటికీ నెగిటివ్ టాక్ వల్ల సినిమా విడుదలైన రెండో రోజుకే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిపోయింది. రెండో రోజు కేవలం రూ.8 కోట్ల షేర్ మాత్రమే సాధించిందంటే HHVM కలెక్షన్లు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై పవన్ అభిమానుల కంటే ఏపీ, తెలంగాణలోని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.

టాలీవుడ్ హీరోల్లో పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ ఒక వారం పాటు గట్టిగా టికెట్లు తెగేలా చేస్తుందని, 2025 మొదటి ఆరు నెలల్లో జరిగిన నష్టాన్ని హరిహరవీరమల్లు భర్తీ చేస్తుందని భావించారు. కానీ.. సినిమా విడుదలైన రెండో రోజుకే ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువవడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లబోదిబోమంటున్నారు. హరిహర వీర మల్లు సినిమా ఫస్ట్ డే మంచి కలెక్షన్లనే కొల్లగొట్టింది. ఫస్ట్ డే 36 కోట్ల షేర్ను హరిహరవీర మల్లు సాధించడం గమనార్హం. అయితే.. ప్రీమియర్ షోతో బయటికొచ్చిన నెగిటివ్ టాక్ ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది.

హరిహరవీర మల్లు సినిమా స్టోరీపై మాత్రమే కాదు వీఎఫ్ఎక్స్పై కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం ఈ సినిమాకు శాపంగా మారింది. ఇలా.. హరిహరవీర మల్లు సినిమాకు థియేటర్లు అయితే భారీ సంఖ్యలోనే ఉన్నాయి గానీ స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒక పీరియాడిక్ డ్రామా జానర్లో తెరకెక్కిన సినిమాకు ఈ స్థాయిలో నెగిటివిటీ మూటగట్టుకున్న సినిమా ఈ మధ్య కాలంలో హరిహర వీరమల్లునే కావడమే గమనార్హం.

సనాతన ధర్మం ప్రస్తావన ఉన్నా ఈ సినిమా కలెక్షన్లకు ఈ అంశం అంతగా కలిసిరాలేదు. కర్ణాటకలో కేవలం 2 కోట్ల షేర్, మిగిలిన రాష్ట్రాలు కలిపి 60 లక్షల షేర్ మాత్రమే సాధించి పవన్ కల్యాణ్ అభిమానుల పాన్ ఇండియా సినిమా ఆశలపై ‘హరిహర వీరమల్లు’ నీళ్లు చల్లింది.