పవర్ స్టార్ డబుల్ ట్రీట్

పవర్ స్టార్ డబుల్ ట్రీట్
  • బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేందుకు ప్లాన్

ఓ వైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. గత నెలలో ‘భీమ్లానాయక్‌‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయ్యింది. హరీష్‌‌ శంకర్ డైరెక్షన్‌‌లో ‘భవదీయుడు భగత్‌‌సింగ్‌‌’ షూట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. సురేందర్‌‌‌‌ రెడ్డి డైరెక్షన్‌‌లోనూ ఓ సినిమా కమిట్‌‌మెంట్‌‌ ఉంది. ఇదిలా ఉంటే పవన్ బ్యాక్ టు బ్యాక్ రీమేక్ సినిమాల్లో నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. తమిళంలో మెప్పించిన వినోదాయ సిత్తం, తేరి, విక్రమ్ వేద చిత్రాల రీమేక్స్‌‌లో పవన్ నటించబోతున్నారని టాక్. వీటిలో ‘వినోదాయ సిత్తం’ ముందుగా సెట్స్‌‌కి వెళ్లనుంది. మరోవైపు సుధీర్ వర్మ డైరెక్షన్‌‌లోనూ పవన్ నటించబోతున్నాడని టాక్. మొత్తానికి ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలలోపు వీలయినన్ని సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా పాలిటిక్స్‌‌ మీదే దృష్టి పెట్టబోతున్నారట పవన్. ఇక థియేటర్స్‌‌లో మెప్పించిన ‘భీమ్లానాయక్‌‌’ త్వరలో ఓటీటీకి రాబోతోంది. ఈనెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌‌ స్టార్‌‌‌‌తో పాటు ఆహాలోనూ స్ట్రీమ్ కానుంది.