కులగుణగణనపై స్పందించిన పవన్​ ..సీఎం జగన్ కు 12 ప్రశ్నలతో లేఖ...

 కులగుణగణనపై స్పందించిన పవన్​ ..సీఎం జగన్ కు 12 ప్రశ్నలతో లేఖ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే.  మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ అధికారపార్టీపై పలు కీలక విమర్శలు, ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు జనసేనాని. ఈ క్రమంలోనే ఏపీలో కులగణన ప్రక్రియ పొలిటికల్ విమర్శలకు దారితీసింది..  ఎన్నికల వేళ కులగణన ఎందుకు అంటూ సీఎం జగన్ కి( CM Jagan ) లేఖ రాశారు.ఈ లేఖలో కొన్ని ప్రశ్నలు సంధించారు.

కులగణనకి సంబంధించి పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలు.ఈమేరకు సీఎం జగన్‌ కు లేఖ రాశారు పవన్. కులగణన చేపట్టడం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్నారు. ప్రక్రియకు కారణాలు వివరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదు? ఆర్టికల్‌ 21 ప్రకారం వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛను హరించడం కాదా? అని ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్ లో ఏపీ సీఎం జగన్‌కి.. పీఏంవోకు ట్యాగ్ చేశారు పవన్. బిహార్‌ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు రాకముందే మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు? అని క్వశ్చన్ చేశారు పవన్

ఏపీలో జరుగుతున్న కుల గణనను తప్పుబట్టారు జనసేనపార్టీ అధినేత. కులగణన ప్రక్రియపై పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల వేళ కుల గణన ఎందుకు అని ప్రశ్నించారు. మొత్తం 12 ప్రశ్నలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.