OG Official Release : OG రిలీజ్ డేట్ వచ్చేసింది ..హంగ్రీ చీతా దూకుడు సిద్ధం

OG Official Release : OG రిలీజ్ డేట్ వచ్చేసింది ..హంగ్రీ చీతా దూకుడు సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ(OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

లేటెస్ట్గా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ఇచ్చారు మేకర్స్. 2025 సెప్టెంబర్ 27న ఓజీ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయం తెల్సుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

అయితే ఈ మూవీలో ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ అనుకున్నారు అంతా..కానీ, ఓజి అంటే 'ఓజాస్ గంభీర' అని తెలిసింది.ఇక ఈ పేరే టైటిల్గా పెడితే పవర్ ఫుల్గా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు మరో టైటిల్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. హంగ్రీ చీతా (Hungry Cheetah) అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

ప్రొడ్యూసర్ DVV దానయ్య  నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das), శ్రియ రెడ్డి (Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.