TheyCallHimOG: ఓజీ బిగ్గెస్ట్ అప్‍డేట్.. అక్కడ ఆగస్ట్ 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

TheyCallHimOG: ఓజీ బిగ్గెస్ట్ అప్‍డేట్.. అక్కడ ఆగస్ట్ 29 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. జులైలోనే షూటింగ్ ముగించుకున్న ఓజీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. సెప్టెంబర్ 25న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో లేటెస్ట్గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

‘OG’ USA ఓవర్సీస్ హక్కులను ‘ప్రత్యంగిరా సినిమాస్’భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్పై క్రేజీ అప్డేట్ అనౌన్స్ చేసింది. "OG..ఎంతోకాలంగా మనందరం ఆసక్తిగా ఎదురుచూసే అభిమాన హీరో మూవీ. ఇపుడు నీరిక్షణకు తెరపడే సమయం దగ్గరపడింది. ఆగస్టు 29 నుండి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. మీ ప్రేమతో OG తుపానుని చూసేయండి.." అని ప్రత్యంగిరా సంస్థ తెలిపింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ సినిమా వాయిదా పడుతుందనే పుకార్లన్నింటికీ తెరపడింది.

ఈ క్రమంలో.. ఓవర్సీస్ గత సినిమాల రికార్డులన్నీ OG బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫైర్ స్ట్రామ్ సాంగ్, మూవీ పోస్టర్స్ ప్రతిదీ అంచనాలు పెంచేలా చేశాయి. మరి ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ టైం గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి అంచనాలు ఎలా ఉంటాయో!

ఇదిలా ఉంటే.. ఇందులో పవన్ కళ్యాణ్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుంది. ఇవాళ సాయంత్రం తన పాత్ర 'కన్మణి'కి సంబంధించిన ప్రోమో రిలీజ్ కానుంది. OGలో ఇమ్రాన్ హష్మీ విలన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.  థమన్ సంగీతం అందించిన ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు.