డైమండ్ రాణి రోజా.. ఛీ నా బతుకు చెడ..! : పవన్

డైమండ్ రాణి రోజా.. ఛీ నా బతుకు చెడ..! : పవన్

తనపై విమర్శలు చేసిన మంత్రి రోజాకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోంది అంటూ సెటైర్లు వేశారు. మీ కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటున్నా  అని.. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో వివేకానంద వికాస వేదికపై నిర్వహించిన యువశక్తి సభలో ఆయన అన్నారు. ప్రతి వెధవ, సన్నాసితో మాటలు పడుతున్నానని చెప్పారు. తనకు ఇదంతా పర్లేదని.. కాని మీ కోసం మీరే నిలబడాలి.. మీ కోసం నిలబడే వారికి అండగా నిలవాని అంటూ పవన్ కళ్యాణ్ యువతకు పిలుపునిచ్చారు.

తాను రాజకీయాల్లోకి వచ్చింది తిట్టడానికి కాదని.. ఒకరితో మాటలు పడుతున్నా తనకు బాధ లేదన్నారు. సినిమాల్లోనే ఉంటే ఇప్పుడు తనను తిడుతున్న వాళ్లే సెల్పీలు దిగేవాళ్లని పవన్ అన్నారు. సినిమాల్లో నటించి స్టార్ అయినా తనకు ఆనందం లేదని.. పేదల కోసం తిట్లు పడినా సంతోషమే అని చెప్పారు. సినిమాల్లో 2 గంటల్లో కష్టాలు తీర్చొచ్చు.. కాని రియాలిటీలో అట్ల కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.