
టీడీపీ-జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట, అరకు అభ్యర్థులను టీడీపీ ప్రకటించిన క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి కౌంటర్ గా పవన్ కళ్యాణ్.. రాజోలు, రాజానగరం టికెట్లను ప్రకటించారు. ఈ రెండు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
ఏపీలో పొత్తు చిత్తు అవుతుందా.. టీడీపీకి పోటీగా రాజాం, రాజానగరం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ #Janasena #TDP #YSRCPAgain2024 #AndhraPradesh #Vijayawada #APPolitics pic.twitter.com/1OiEem0Bnj
— raghu addanki (@raghuaddanki1) January 26, 2024
ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు. పొత్తులో ఉండగా.. అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారు టీడీపీని ప్రశ్నించారు. ఇది పొత్తు ధర్మ కాదన్నారు. లోకేశ్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదు.. రాష్ట్ర ప్రజల కోసం మౌనంగా ఉన్నానని చెప్పారు. పొత్తు.. ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు.. టీడీపీ-జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చని, ఒక మాట అటున్నా.. ఇటున్నా కలిసే వెళ్తున్నామని అన్నారు. బలం ఇచ్చే వాళ్లమే అవుతున్నాం కానీ.. బలం తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామన్నారు. వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు.. కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటించామని తెలిపారు. చంద్రబాబుకు ఉన్నట్లే.. తనకూ ఒత్తిడి ఉందన్నారు.ప్రత్యేక పరిస్థితుల్లో రెండు సీట్లను ప్రకటించాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు.