ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్ బాధ్యతలు

ఏపీ డిప్యూటీ సీఎంగా  పవన్‌ కల్యాణ్ బాధ్యతలు

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు.   విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఉదయం10 గంటల 47 నిమిషాలకు  బాధ్యతలు స్వీకరించారు.  ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు పవన్‌.  అనంతరం పవన్ కు ఇంద్రకీలాద్రి దేవస్ధాన  వేదపండితుల ఆశీర్వచనాలు అందించారు. బాధ్యతలు స్వీకరించగానే పలు ఫైళ్లపైన పవన్ సంతకాలు చేశారు.  

మరికాసేపట్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులతో పవన్ భేటీ కానున్నారు.  గ్రూప్ 1, 2 అధికారులతో కూడా  సమావేశం కానున్నారు పవన్.  మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ అసోషియేషన్ తో పవన్ భేటీ అవుతారు.  రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులోనే పవన్ బస చేయనున్నారు.  పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటుగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు.