OG Box Office: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 3 డేస్ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

OG Box Office: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ 3 డేస్ కలెక్షన్స్.. గ్రాస్, నెట్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ వసూళ్ల వేట కొనసాగిస్తోంది. గురువారం Sept 25న థియేటర్లలో రిలీజైన మూవీ, మూడో రోజైనా శనివారం వసూళ్లు కాస్తా తగ్గాయి. శనివారం ఇండియాలో రూ.18.5 కోట్లు వసూలు చేసింది.

బుధవారం ప్రీమియర్స్ రూ.21 కోట్లు, డే1 (గురువారం) రూ.63.75 కోట్లు, డే2 (శుక్రవారం) రూ.18.75, డే3 రూ.18.5 కోట్లు.. ఇలా మూడు రోజులు కలిపి ఇండియాలో రూ.122 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 

ఇకపోతే ‘ఓజీ’ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.245 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, గ్రాస్ వసూళ్ల విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. తొలిరోజు రూ.154 కోట్ల గ్రాస్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ తర్వాత రెండ్రోజులు ప్రకటించకపోవడం గమనార్హం!

ట్రేడ్ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం,

సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ ద్వారానే తెలుగులో రూ.21 కోట్లు సాధించి ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో 2025లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా ఓజీ నిలిచింది.

డే 1 (గురువారం) సెప్టెంబర్ 25న రూ. 63.75 కోట్ల నెట్, డే2 (శుక్రవారం) రూ.18.75 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 70.59 శాతం కలెక్షన్స్ తగ్గాయి. అయితే, తెలుగులో మాత్రం కలెక్షన్లు పర్వాలేదు అనేలా ఉంది. రెండో రోజైన శుక్రవారం తెలుగులో-18.15 కోట్లు, తమిళం-0.15 కోట్లు, కన్నడ-5 లక్షలు, హిందీ- 4 లక్షలుగా ఉన్నాయి.

ఈ క్రమంలో మూడో రోజైన శనివారం రూ.18.5 కోట్ల నెట్ రాబట్టింది. తెలుగు థియేటర్ల నుంచి రూ.17.75 కోట్లు రాగా, తమిళం నుంచి 2 లక్షలు, కన్నడ, హిందీలో 5 లక్షలు వసూలు నమోదు అయ్యాయి. ఇలా ఓజీ మూవీ మూడు రోజుల వసూళ్లను కలుపుకుని ఇండియాలో మొత్తంగా రూ.122 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

►ALSO READ | KRamp: ‘కె ర్యాంప్’ అంటే బూతు మాట కాదు.. కిరణ్ మీటర్ లోనే కథ రాశా.. నాని కామెంట్స్ వైరల్

కలెక్షన్లు తగ్గినప్పటికీ, ఓజీ పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. భీమ్లా నాయక్ లైఫ్ టైం (210కోట్లు) వసూళ్లను కేవలం రెండు రోజుల్లోనే అధిగమించింది.

ఇదిలా ఉంటే.. ఓజీ మూవీ ఉత్తర అమెరికా, UK వంటి దేశాల్లోనూ దుమ్మురేపుతుంది. ఉత్తర అమెరికాలో 4.7 మిలియన్ డాలర్లకి పైగా (రూ.41 కోట్లు) సంపాదించింది. UKలో £309,574+ పైగా లెక్కలతో ఓజీ సంచలనం సృష్టించింది. ఇందులో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించి ఫ్యాన్స్ కు మాస్ విందు వడ్డించారు. మరి ఈ లెక్కన వీకెండ్ వసూళ్లను రేపు మేకర్స్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. 

సుజీత్ డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సుమారు రూ.250 కోట్లతో నిర్మించారు. ఈ మూవీలో హీరోయిన్ ప్రియాంక మోహన్ తోపాటు ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, ఉపేంద్ర, అర్జున్ దాస్ లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు.