పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రాబోతున్న మరో క్రేజీ చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్ ఇప్పటికే రెండు పాటలను విడుదల చేయగా వాటికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ను అందించబోతున్నట్టు టీమ్ తెలియజేసింది. ‘ఇట్స్ బిగిన్స్.. ఆనందంతో మీ చేతులను పైకెత్తి మన ఉస్తాద్ కోసం ఉత్సాహంగా నినాదాలు చేయండి.
అతి త్వరలోనే బ్లాస్టింగ్ అప్‌డేట్ ఇవ్వబోతున్నాం’ అని టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ఇద్దరూ చేతులను పైకెత్తి చూపించిన స్టిల్‌ను విడుదల చేయడం ఆకట్టుకుంది. పవన్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం మాసివ్ ఫీస్ట్ కానుందని దర్శకుడు హరీష్ తెలియజేశారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ రిలీజ్ డేట్ విషయంలోనే త్వరలో అప్‌డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
