కల్వకుర్తి/జడ్చర్ల/వనపర్తి, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల అగ్రికల్చర్ మార్కెట్‌లో శనివారం పల్లికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్‌కు రూ. 12,009 దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వనపర్తి మార్కెట్‌లో క్వింటాల్ పల్లి రూ. 12,002 ధర పలికింది. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ ఆఫీసర్లు తెలిపారు. సెకండ్ గ్రేడ్ వేరుశనగకు రూ. 10,950, మూడో రకానికి రూ. 7,109 ధర పలికింది.
